Telugu Gateway
Politics

డేంజర్ జోన్ లో హైదరాబాద్

డేంజర్  జోన్ లో హైదరాబాద్
X

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా టెస్ట్ లు ఎందుకు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో రోజూ కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 4 లక్షల14 వేల N95 మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామన్నారు.

అయినా కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. కరోనా టెస్టులు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ద్వజమెత్తారు. తెలంగాణలో విచిత్ర పాలన సాగుతోందని అన్నారు. మజ్లిస్ కు భయపడే హైదరాబాద్ లో కరోనా పరీక్షలు సరిగా చేయటంలేదన్నారు. మర్కజ్ తర్వాతే తెలంగాణాలో కేసులు పెరిగాయన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.

Next Story
Share it