Telugu Gateway
Telangana

జూన్ నెలలో తెలంగాణలోనూ పూర్తి వేతనాలు

జూన్ నెలలో తెలంగాణలోనూ పూర్తి వేతనాలు
X

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. జూన్ నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా సంక్షోభంతో సర్కారుకు ఆదాయం పడిపోయిందని చెప్పి గత మూడు నెలలుగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మే నెల నుంచే పూర్తి వేతనాలు ఇవ్వగా..తెలంగాణ సర్కారు ఒక నెల ఆలశ్యంగా జూన్ నుంచి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని..తమకు పూర్తి వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చివరకు ఈ అంశం హైకోర్టుకు కూడా చేరింది. సర్కారు తాజాగా ఆరోగ్య అత్యియిక పరిస్థితి అంటూ ఆర్డినెన్స్ ను కూడా తీసుకొచ్చింది. లాక్ డౌన్ ఎత్తేయటంతో ఆదాయం కొంత మెరుగుపడిందని..అందుకే పూర్తి వేతనాలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశం అయిన సీఎం కెసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it