Telugu Gateway
Telangana

నలుగురు నిమ్స్ డాక్టర్లకు కరోనా

నలుగురు నిమ్స్ డాక్టర్లకు కరోనా
X

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా డాక్టర్లు కూడా కరోనా బారిన పడటంతో మరింత కలకలం రేగుతోంది. పంజాగుట్టలోని నిమ్స్ లో ఏకంగా ఏకంగా ఏడుగురికి కరోనా సోకింది. ఇందులో నలుగురు డాక్టర్లు ఉండగా, మరో మగ్గురు ల్యాబ్ సిబ్బంది. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో పీజీ విద్యార్ధులు 12 మంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో హాస్టల్ లోని 284 మందిని క్వారంటైన్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులు పెరగటంతో చాలా చోట్ల ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు.

Next Story
Share it