Telugu Gateway
Telangana

తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు

తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు
X

కరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా ముందుకు సాగేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతోపాటు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టెస్ట్ లు సరిగా చేయటంలేదనే విమర్శలు వస్తున్న తరుణంలో పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. అందులో భాగంగా తెలంగాణకు నాలుగు బృందాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్ళనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ 50కి పైగా జిల్లాలు, మునిసిపాలిటీలకు ఈ బృందాలను పంపనున్నారు. మహారాష్ట్ర కు 7, తెలంగాణకు 4, తమిళనాడుకు 7, రాజస్థాన్ కు5, అస్సాంకు 6, హర్యానా కు 4, గుజరాత్ కు3, కర్ణాటకకు 3, ఢిల్లీ కి3, ఉత్తరాఖండ్ కు 3, బీహార్ కు 4కు బృందాలు వెళ్లనున్నాయి.

మధ్యప్రదేశ్ కు 5, పశ్చిమ బెంగాల్ కు3, ఉత్తర ప్రదేశ్ కు 4, ఒడిశా కు5 కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. బృందంలో ప్రజారోగ్య నిపుణులు/ఎపిడెమియాలజిస్టులు/వైద్యులు/సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి నోడల్ అధికారి ఉంటారని తెలిపారు. ఈ బృందాలు నగరాల్లోని కేసుల నియంత్రణ చర్యలు, సమర్థవంతమైన చికిత్స నిర్వహణలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు తోడ్పడటానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పరిశీలించి తగు సూచనలు చేస్తాయి.

Next Story
Share it