Telugu Gateway
Politics

ట్రంప్ కు ముందే క్లారిటీ వచ్చేసిందా!

ట్రంప్ కు ముందే క్లారిటీ వచ్చేసిందా!
X

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోబోతున్నట్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముందే తెలిసిపపోయిందా?. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. డెమోక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బిడెన్ తదుపరి అమెరికా అధ్యక్షుడు కావచ్చొని..ఎందుకంటే కొంత మంది తనను ప్రేమించరని వ్యాఖ్యానించారు. అందుకే జో బిడెన్ అధ్యక్షుడు కావచ్చొని వ్యాఖ్యానించి కలకలం రేపారు. అదే సమయంలో జో బిడెన్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆయన మాట్లాడరు. ఆయన మాట ఎవరూ వినరు. ఆయన ఎప్పుడైనా మాట్లాడినా రెండు వ్యాఖ్యాలు ఒకేసారి చెప్పలేరు’ అంటూ బిడెన్ పై విమర్శలు గుప్పించారు. ఆయన పనిచేయలేరని..పనిచేయగలిగే స్థితిలో కూడా లేరని వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా అమెరికాలో ట్రంప్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా కోవిడ్-19 అగ్రరాజ్యాన్ని వణికించటంలో ప్రదాన పాత్ర ఆయనదే అన్న విమర్శలు ఉన్నాయి. అమెరికాలోని పలు విభాగాలకు చెందిన నిపుణులు ఎంతో ముందు నుంచి హెచ్చరిస్తున్నా కూడా ఆయన పెడిచెవిన పెట్టారనే దేశంలోని అగ్రశ్రేణి పత్రికలు సైతం పలు పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాయి. అయినా సరే ఇప్పటికీ ట్రంప్ తానే రైట్ అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవటం అసాధ్యం అనే అంచనాలు వెలువడుతున్నాయి. చివరకు ట్రంప్ కూడా తనను కొంత మంది ప్రేమించరు కాబట్టి జో బిడెన్ అధ్యక్షుడు అవుతారని వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it