ఏకగ్రీవంగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక
BY Telugu Gateway25 Jun 2020 6:18 PM IST

X
Telugu Gateway25 Jun 2020 6:18 PM IST
డొక్కా మాణిక్యవరప్రసాద్ మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేసి..టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన సీటుకే ఇప్పుడు ఎన్నిక జరిగింది. దీంతో వైసీపీ అధిష్టానం తిరిగి ఆ సీటును డొక్కా మాణిక్యవరప్రసాద్ కే కేటాయించింది. గురువారం నాడు ఆయన ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
దాఖలు అయింది ఒక్కటే నామినేషన్ కావటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు.
Next Story