ఢిల్లీ సీఎంకు కరోనా లక్షణాలు
BY Telugu Gateway8 Jun 2020 12:51 PM IST

X
Telugu Gateway8 Jun 2020 12:51 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా లక్షణాలతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. ఆయన జ్వరంతోపాటు గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో సోమవారం నాటి కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. ఇఫ్పుడు ఏకంగా సీఎంకు కూడా లక్షణాలు కన్పించటంతో ఆయన ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. మంగళవారం నాడు అరవింద్ కేజ్రీవాల్ కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదివారం నుంచే ఆయనకు స్వల్పంగా జ్వరం..గొంతు నొప్పితో బాధపడుతున్నారు.
Next Story



