Telugu Gateway
Telangana

సంతోష్ కుమార్ భార్యకు ఐదు కోట్ల చెక్కు

సంతోష్ కుమార్ భార్యకు ఐదు కోట్ల చెక్కు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోష్ బాబు భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన సీఎం కెసీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఇంతకు ముందు ప్రకటించినట్లుగా సంతోష్ కుమార్ భార్యకు ఐదు కోట్ల రూపాయల చెక్కుతోపాటు హైదరాబాద్ లో నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు ఆర్డీవో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో సీఎం కెసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం సంతోష్ కుమార్ భార్య మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ లో ఎలాంటి అవసరం ఉన్నా ఫోన్ చేయాలని సీఎం కోరారని తెలిపారు.

దీంతోపాటు ఒక సారి తమను కెసీఆర్ తన నివాసానికి ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఐదు కోట్ల రూపాయల సాయంలో నాలుగు కోట్ల రూపాయలు తమ పిల్లల పేరు మీద..కోటి రూపాయలు తమ అత్తగారి పేరి మీద వేయనున్నట్లు తెలిపారు. తమ పిల్లల చదువు కోసం హైదరాబాద్ లోనే ఉంటామని చెప్పి..స్థలం కూడా హైదరాబాద్ లోనే కోరామని..అందుకు అనుగుణంగా ప్రభుత్వం తమకు ఇంటి జాగా ఇచ్చిందని వెల్లడించారు. తనకు నియామక పత్రం అందజేశారని. ఏ శాఖలోో పోస్టు కోరితే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.

Next Story
Share it