Telugu Gateway
Politics

కేసీఆర్ దగ్గర మోసపోని వర్గం లేదు

కేసీఆర్ దగ్గర మోసపోని వర్గం లేదు
X

తెలంగాణలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి కెసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా విషయంలో ఎన్ని మాటలు చెప్పారో ప్రజలంతా చూశారన్నారు. అసలు తెలంగాణలోకి కరోనాను రానిస్తనా?. వస్తే ఊరుకుంటనా అన్నారు. తర్వాత ఓ పారసిటమాల్ తో పోతుందని చెప్పి..ఇప్పుడు మహమ్మారి కరోనా సహజీవనం చేయాలి మీ చావు మీరు చావండి అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిలో కూడా ఏమీలేదని..అది నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జి వంటిదని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పటంలో కెసీఆర్ ను మించిన వారు ఎవరూలేదని..చెప్పిన అబద్దం మళ్లీ చెప్పుకుండా చెప్పటంలో ఆయనకున్న నేర్పు ఎవరికీలేదన్నారు. కెసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తే సెకండ్ షోకు సినిమాకు వెళ్లొచ్చినట్లు ఉంటుందని..రకరకాల ఫీలింగ్స్ కలుగుతాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సోమవారం నాడు గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.

ఆదివారం నాడు నల్లగొండలో మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహరించిన తీరును రేవంత్ తప్పుపట్టారు. చెప్పటం చేతకాక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో వాదనకు దిగారన్నారు. ‘జగదీష్ రెడ్డికి కుస్తీలు పట్టాలని ఉంటే గ్రౌండ్ చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. జగదీష్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి. అడ్డగోలుగా మాట్లాడితే పడేవారు ఎవ్వరూ లేరు. ఆయనకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో అందరికి తెలుసు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఘోరంగా అవమానిస్తుంది. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పై కేసులు ఇంకా తొలగించలేదు కానీ- కేసీఆర్ కుటుంబం పై ఉన్న కేసులను ప్రత్యేక టీమ్ లను పెట్టి కేసులు కొట్టేయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమ కారుల పై కేసులు తొలగించకపోవడాన్ని చూస్తే ఉద్యమ కారులకు టీఆరెస్ ప్రభుత్వం ఎంత మర్యాద ఇస్తుందో అర్థం అవుతుంది. విలువలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకుంటే-నిర్బంధ తెలంగాణగా ప్రపంచానికి కనిస్తోంది. ఉచిత విద్య- దళిత గిరిజన రిజర్వేషన్లు, డబుల్ బెడ్ ఇండ్లు- మూడెకరాల భూమి, నీటి ప్రాజెక్టులు ఎక్కడ పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తి అయినా అంబేద్కర్ విగ్రహం ఏమైంది-కనీసం పునాది రాయి వెయ్యలేదు. దళిత బిడ్డ రాజయ్య పై అవినీతి ఆరోపణలు బర్తరఫ్ చేసి ఇప్పటి వరకు ఎందుకు ఆరోపణలు నిరూపించలేదు. ప్రజలు తిరస్కరించినా సిగ్గు లేకుండా కూతురు, కుటుంబ సభ్యులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదా? వ్యాపారం కోసం టీఆర్ఎస్ నేతలకు యూనివర్సిటీ లను కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు.

Next Story
Share it