Telugu Gateway
Politics

భారత్ ఎగుమతులను ఆపిన చైనా

భారత్ ఎగుమతులను ఆపిన చైనా
X

దెబ్బకు దెబ్బ. ఇదే మోడల్ ను చైనా ఫాలో అవుతోంది. భారత్ కు చెందిన ఎగుమతులను చైనా, హాంకాంగ్ లో నిలిపివేశారు. వీటికి ఆమోదం తెలపటంలో జాప్యం చేస్తున్నారు. ఇది ప్రతీకార్య చర్యల్లో భాగంగానే చేస్తున్నట్లు దేశంలోని అధికారులు భావిస్తున్నారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా చైనా, హాంకాంగ్ ల్లో కస్టమ్స్ క్లియరెన్స్ లేకుండా పక్కన పెడుతున్నారు. దీంతో ఈ ఎగుమతుల క్లియరెన్స్ కోసం వేచిచూడాల్సి వస్తోంది. భారత్ కూడా ప్రస్తుతం అదే పనిచేస్తోంది.

చైనా నుంచి వచ్చిన దిగుమతులను ఇఫ్పుడు భౌతికంగా పరిశీలించిన తర్వాత కూడా అనుమతులు ఇవ్వటం లేదు. ఈ కారణంగానే చైనా కూడా భారత్ ఎగుమతులను ఇబ్బంది పెడుతోంది. గత కొంత కాలంగా భారత్ లో బాయ్ కాట్ చైనా వ్యవహారం పెద్ద ఎత్తున నడుస్తోంది. కొంత మంది కేంద్ర మంత్రులు కూడా ఈ మేరకు ప్రకనటలు చేశారు. కానీ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలతో పాటు ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు ఇలా దెబ్బతీసుకునే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాలు అన్నీ ఎటువైపు మళ్ళుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it