Telugu Gateway
Telangana

కేంద్ర బృందం రాక..ఈ సారైనా మార్పు వస్తుందా?!

కేంద్ర బృందం రాక..ఈ సారైనా మార్పు వస్తుందా?!
X

తెలంగాణకు కేంద్ర బృందాలు వస్తున్నాయి..పోతున్నాయి. కానీ కరోనా కేసుల నియంత్రణ విషయంలో మాత్రం ఫలితాలు మాత్రం ఏమీ ఉండటం లేదు. మరి వాళ్ళు ఏమి చూస్తున్నారు..రాష్ట్రానికి ఏమి సిపారసులు చేస్తున్నారు అన్నది మిస్టరీయే. ఈ సారి కూడా అదే సీన్ రిపిట్ అవుతుందా? లేక ఏమైనా తేడా ఉంటుందా?. వేచిచూడాల్సిందే. తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంతే కాదు..పాజిటివిటీ రేటు మరీ ఎక్కువగా ఉంది. కానీ సర్కారు మాత్రం టెస్ట్ ల సంఖ్యను పెంచటానికి ఏ మాత్రం ఆసక్తిచూపటం లేదు. పలు రాష్ట్రాల నిత్యం వేల సంఖ్యలో టెస్ట్ లు చేస్తున్నా తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. ఈ విషయంలో రాబోయే రోజుల్లో అయినా మార్పు వస్తుందో రాదో ఎవరికీ తెలియదు.

ఈ తరుణంలో మరోసారి కేంద్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. వీరు సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పర్యటిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటునుంచి శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకే ఆయా రాష్ట్రాలకు కేంద్రం బృందాలను పంపుతోంది.

Next Story
Share it