Telugu Gateway
Politics

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
X

తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని నిరసిస్తూ బిజెపి రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాడు నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సంజయ్ హైదరాబాద్ లోని కోఠిలోని కరోన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు ప్రయత్నాంచారు. దీంతో సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు బిజెపి కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు జోకర్ల లాగా మారారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలి. మన సీఎం పారసీటమాల్ ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. ’ అని తెలిపారు.

Next Story
Share it