Telugu Gateway
Telangana

కరోనాపై శ్వేతపత్రానికి బిజెపి డిమాండ్

కరోనాపై శ్వేతపత్రానికి బిజెపి డిమాండ్
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా విషయంలో కెసీఆర్ సర్కారు తీరును తప్పుపట్టారు. పొరుగు రాష్ట్రాలు ఏ రోజుకు ఆ రోజు ఎన్ని టెస్ట్ లు చేశారో చెబుతుంటే తెలంగాణ మాత్రం ఈ విషయంలో అంతా రహస్యం అన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో సరిగా టెస్ట్ లు చేయకపోవటం, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అమలు చేయని అంశంపై తాను ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘గాంధీలో సరైన సౌకర్యాలు లేవని స్వయంగా బాధితులే చెప్తున్నారు. రోజు రోజుకు కరోన తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ చేపట్టడం లేదు.

కరోన బాధిత మరణాలను సైతం ప్రభుత్వం, అధికారులు దాచిపెడుతున్నారు. ప్రభుత్వ డాక్టర్స్, నర్సులు , పిజి వైద్య విద్యార్థులకు భరోసా లేకుండా పోయింది. జర్నలిస్టులకు సంబంధించిన ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాలి. తెలుగు మీడియాలో మొట్టమొదటి కరోన మరణం అందరిని భయ భ్రాంతులకు గురిచేసిస్తుంది. ఎంతమంది ప్రభుత్వ డాక్టర్లకు పిపిఈ కిట్స్ అందించారో లెక్కలతో సహా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. కరోన కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం సరిగా ఖర్చు పెట్టడం లేదు.’ అని బండి సంజయ్ ఆరోపించారు.

Next Story
Share it