Telugu Gateway
Politics

కరోనా టెస్ట్ లో సీఎంకు నెగిటివ్

కరోనా టెస్ట్ లో సీఎంకు నెగిటివ్
X

జ్వరం, దగ్గుతో సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట. ఆయన మంగళవారం ఉదయం కరోనా టెస్ట్ చేయించుకోగా..సాయంత్రానికి ఫలితాలు వచ్చాయి. అందులో ఆయనకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆస్పత్రుల్లో స్థానికులకు మాత్రం కరోనా వైద్యం చేస్తామంటూ..కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో మాత్రం ఎవరైనా చేరవచ్చు అంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది.

Next Story
Share it