వచ్చే వారం నుంచి విజయవాడ-హైదరాబాద్ బస్సులు
BY Telugu Gateway18 Jun 2020 7:40 PM IST

X
Telugu Gateway18 Jun 2020 7:40 PM IST
లక్షలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే వారం నుంచి హైదరాబాద్-విజయవాడ మార్గంతోపాటు తెలంగాణ, ఏపీల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బస్సు సర్వీసులు నడిపేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు గురువారం నాడు చర్చించారు.
ఈ ప్రాథమిక చర్చల అనంతరం మరోసారి భేటీ అయి తుది కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అయితే వచ్చే వారం నుంచి మాత్రం ఖచ్చితంగా బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఇవి ఉంటాయని ఏపీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు 256 సర్వీసులు నడిపేందుకు చూస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆఫరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
Next Story



