ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
BY Telugu Gateway3 Jun 2020 5:39 PM IST

X
Telugu Gateway3 Jun 2020 5:39 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మూడు నెలల పొడిగింపు లభించింది. వాస్తవానికి అయితే ఆమె ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ కరోనా సంక్షోభం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీఎస్ కు ఆరు నెలల పొడిగింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కు లేఖ రాశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను పరిశీలించి మూడు నెలల పాటు సీఎస్ పదవి కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story