Telugu Gateway
Cinema

అనుష్క సంచలన వ్యాఖ్యలు

అనుష్క సంచలన వ్యాఖ్యలు
X

ఈ ప్రపంచంలో ఎవరూ పర్పెక్ట్ కాదు అంటూ స్వీటిగా పిలుచుకునే అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై స్పందించిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనమంతా రోడ్డు మ్యాప్ తో పుట్టలేదు. మనకు సరైంది అన్పించిన మార్గంలో ముందుకు సాగుతున్నాం. మనమంతా మానసికంగా బాధలు పడుతుంటాం. అయినా పర్వాలేదు.

కొందరు సాయం కోసం బయటపడి ఏడుస్తారు. కొందరు లోలోపలే కుమిలిపోతుంటారు. ’ అని వ్యాఖ్యానించారు. బాధలను పంచుకోవాలని..ఇతరుల మాటలు వినాలని అనుష్క సలహా ఇచ్చారు. మనమంతా మనుషులం. ఓ నవ్వు..మాటల్ని వినే గుణం, అప్యాయతతో కూడిన స్పర్శ..ఎదుటి వ్యక్తి జీవితంలో ఎంతో కొంత మార్పు తెస్తుందని అనుష్క పోస్ట్ చేశారు.

Next Story
Share it