Top
Telugu Gateway

తెలంగాణలో 3297 శాంపిళ్ళకే 730 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 3297 శాంపిళ్ళకే 730 పాజిటివ్ కేసులు
X

ఏపీకి, తెలంగాణకు కరోనా పరీక్షలు..పాజిటివ్ కేసుల విషయంలో ఒక్క రోజు లెక్క చూడండి. ఏపీలో ఒక్క రోజు టెస్ట్ చేసిన శాంపిళ్ళు 24,451. అందులో తేలిన పాజిటివ్ కేసులు 439. అదే తెలంగాణ విషయానికి వస్తే ఒక్క రోజు తీసుకున్న శాంపిళ్లు 3291. కానీ తేలిన పాజిటివ్ కేసులు 730. ఈ లెక్కన ఏపీతో పోలిస్తే తెలంగాణలో పాజిటివిటి రేటు ఎంత హెచ్చు స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణతో పోలిస్తే కరోనా టెస్ట్ ల విషయంలో ఏపీ దేశంలోనే ముందు వరసలో ఉంది. కానీ తెలంగాణ మాత్రం టెస్ట్ ల విషయాన్ని ఏ మాత్రం సీరియస్ గా తీసుకోకపోవటం వల్ల పాజిటివిటి రేటు చాలా ఎక్కువగా నమోదు అవుతోంది. రాబోయే రోజుల్లో టెస్ట్ ల సంఖ్యను మరింత గణనీయంగా పెంచి వైరస్ ను నియంత్రించకపోతే ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలో వైరస్ మరింత ఎక్కువ కాలం ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనుమానితులు అందరికీ టెస్ట్ చేయటంతోపాటు..ప్రభుత్వం ర్యాండమ్ గా టెస్ట్ లు చేస్తూ బాధితులను గుర్తిస్తేనే వైరస్ ను నియంత్రించటం సాధ్యం అవుతుందని..ఇలా అతి తక్కువ టెస్ట్ లు చేస్తే మాత్రం పరిస్థితి ఇలాగే ఆందోళనకరంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటీవల ప్రకటించిన 50 వేల టెస్ట్ లు ఏ మాత్రం సరిపోవని..అంతకు మంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకపర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ సర్కారు మాత్రం తాము అనుకున్న విధంగా ముందుకు పోతుంది తప్ప..ఈ అంశంపై పెద్దగా ఫోకస్ పెడుతున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.

ప్రస్తుతం నగరంలోని ఆస్పత్రుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని..పాజిటివ్ గా గుర్తించిన వారికి సేవలు అందించటంలో కూడా విపరీతమైన జాప్యం చోటుచేసుకుంటుందని బాధితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం లక్ష మంది వైరస్ బారిన పడ్డా చికిత్స చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. తీరా కేసులు ఇంకా ఎనిమిది వేలకు చేరకపోతే హైదరాబాద్ వంటి నగరంలో కూడా ఫేషంట్లు విలవిలాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న 7802 మొత్తం పాజిటివ్ కేసుల్లో 3731 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 3861 ఉన్నాయి. ఇంత మందికే వైద్య సేవలు అందించేందుకు పలు సమస్యలు ఎధుర్కొంటున్న ఆస్పత్రులు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం.

Next Story
Share it