Telugu Gateway
Politics

జగన్ మోసం చేశారు

జగన్ మోసం చేశారు
X

పోతిరెడ్డిపాడు ఎలా ఆపాలో మాకు తెలుసు

‘ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్ళే ముందు మాతో మాట్లాడితే బాగుండేది. పోతిరెడ్డిపాడు ను ఎట్లా ఆపాలో మాకు తెలుసు. ఏపీ ప్రభుత్వ ఎత్తు కు పై ఎత్తు వేస్తాం.’ అని తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు తీరును తప్పుపట్టారు. పోతిరెడ్డిపాడు విషయంలో రెండు జాతీయ పార్టీ ల మాటలు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కోతి కి కొబ్బరి చిప్ప దొరికినట్లు పోతిరెడ్డిపాడు అంశాన్ని కాంగ్రెస్ ,బీజేపీ లు రాజకీయం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ను శంకుస్థాపన చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మంత్రి గా ఉన్న ఉత్తమ్ ఏంధుకు మాట్లాడలేదు.. అప్పటి మంత్రి పొన్నాల శభాష్ అనలేదా.పోతిరెడ్డిపాడు కు కాంగ్రెస్ శంకుస్థాపన చేస్తే ఆ పార్టీ నేతలు హారతి పట్టలేదా. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కు నిరసనగా మంత్రి పదవులకు రాజీనామా చేసింది టిఆర్ఎస్.

అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా ఉమ్మడి మహబూబ్ నగర్ గురించి పట్టించుకున్నారా? పోలవరం కోసం మా ఏడుమండలాలు ఏపీ లో కలిపారు.దమ్ముంటే బీజేపీ నేతలు వాటిని వెనక్కి తెప్పించాలి. తెలంగాణ పీసీసీ ఓకటి మాట్లాడితే ఏపీ పీసీసీ మరోకటి మాట్లాడుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే , ఏపీ బీజేపీ అధ్యక్షుడు మరోకటి మాట్లాడుతడు. ఈ రెండు పార్టీలు కలసి కేంద్రానికి లేఖ ఇవ్వలేరా..కేంద్ర మంత్రి తో మాట్లాడలేరా..ప్రధాని అపాయింట్ మెంట్ ఏంధుకు కోరట్లేదు. కర్నాటక, మహారాష్ట్ర లో అన్ని పార్టీలు ఒక్కటై ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్నాయి. తెలంగాణ లో మాత్రం ప్రతిపక్షాలు రాజకీయం కోసం పాకులాడుతున్నాయి. ఏపీ సీఎం కు తెలంగాణ సీఏం ను ఒప్పించి ప్రాజెక్ట్ కట్టుకోవాలనే అభిప్రాయం ఉండాలి. కేసీఆర్ కుమ్మక్కు అయ్యే వాడే అయితే తెలంగాణ వచ్చేదే కాదు. ప్రాజెక్ట్ ఆపడానికి ప్రతిపక్షాలు ప్రణాళికలు చేయాలి. కేసీఆర్ ను విమర్శిస్తే ప్రజల మద్దతు ఉంటుందని ప్రతిపక్షాలు అనుకుంటె పొరపాటు ...ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రభుత్వం పై విమర్శలు కాకుండా కేంద్రం తో మాట్లాడి పోతిరెడ్డిపాడు ను ఎట్లా ఆపాలో ప్లాన్ చేయండి’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it