చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త
BY Telugu Gateway19 May 2020 12:36 PM IST

X
Telugu Gateway19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు రావొద్దని సీఎం కెసీఆర్ చెప్పారు. జాగ్రత్త బాబూ. నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడుతుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 14 సంవత్సరాల సీఎం. ప్రతిపక్ష నేతగా పదకొండేళ్ళులాంటికి కరోనాకు అర్ధం కావు’ అని ట్వీట్ చేశారు.
‘ ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజుల పాటు ఎదురుచూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్ళను రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరుకారిపోయాయి. కెసీఆర్ ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని’ అని మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Next Story