Telugu Gateway
Politics

జగదీష్ రెడ్డి..ఉత్తమ్ మాటల యుద్ధం

జగదీష్ రెడ్డి..ఉత్తమ్ మాటల యుద్ధం
X

‘నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు. ’ ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. ‘నువ్వు మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఓ దశలో ఇద్దరు నేతలు వేదికపైనే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగు అంశంపై జరిగిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సీనియర్ నేతల తీరు చూసి అధికారులు కూడా అవాక్కైన పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని రీతిలో రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ మంత్రి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.

రుణమాఫీ వివరాలను తాము అసెంబ్లీ సాక్షిగా వివరించి..ప్రతిపక్ష పార్టీలు వినకుండా పారిపోయాయని అన్నారు. తాను మంత్రిని అని..ఇక్కడ ఎవరైనా తాను చెప్పింది వినాల్సిందేనని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు పలువురు ఉత్తమ్ కుమార్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బానిస మనస్తత్వాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ నేతలకు రైతులు బాగు పడటం ఇష్టం లేదు. జూన్ 2 దశాబ్దాల కళ స్వరాష్ట్రం సాకారం అయిన రోజు.... రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తాం, బ్లాక్ డే గా పాటిస్తాం అంటున్న కాంగ్రెస్ నేతలు ముమ్మాటికి తెలంగాణా ద్రోహులే. కాంగ్రేస్ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు.

Next Story
Share it