Telugu Gateway
Politics

తెలంగాణ సర్కారుది తుగ్లక్ చర్య

తెలంగాణ సర్కారుది తుగ్లక్ చర్య
X

తెలంగాణ సర్కారు ప్రతిపాదించిన నియంత్రిత పంటల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాము చెప్పిన పంటలే వేయాలని రైతులను బెదిరించటం తుగ్లక్ చర్య అని వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ చెబుతున్న సమగ్ర వ్యవసాయ విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈ ఖరీఫ్‌లో దీన్ని అమలు చేయవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ చెప్పిన వ్యవసాయ విధానంపై తాము చర్చించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పంట వేయాలనడం సరికాదన్నారు. రైతులపై ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమనడం రైతులను అవమానించడమే అవుతుందన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తాము పోరాటం చేస్తామని అన్నారు. దరిద్రపు టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాణీ ఎందుకు చేయలేదని, రైతు బంధు 40శాతం రైతులకు ఇంకా ఎందుకు అందలేదని ప్రశ్నించారు.

Next Story
Share it