Telugu Gateway
Telangana

జీహెచ్ఎంసీలో ఆగని కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో ఆగని కరోనా కేసులు
X

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు కూడా తెలంగాణలో కొత్తగా 41 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, మరో పది కేసులు మాత్రం వలస కూలీలకు సంబంధించినవి. తాజాగా వచ్చిన 41 కేసులు కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1367కు పెరిగింది. బుధవారం ఒక్క రోజే 117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

దీంతో మొత్తం కోలుకున్న వారు 939 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 394 మంది. ఇఫ్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 34కు చేరింది. తెలంగాణలో రికవరి శాతం 69 ఉండగా, మరణాల శాతం కేవలం రెండు మాత్రమే. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వలస కూలీలు వస్తున్నారని..ఇప్పటి వరకు 35 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.

Next Story
Share it