Telugu Gateway
Politics

కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నమోడీ

కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నమోడీ
X

టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు చేస్తోందని ఆరోపించారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సమాఖ్యస్పూర్తితో కూడిన ప్రభుత్వం ఉండాలని కోరిన మోడీ..ఇఫ్పుడు ప్రధాని అయిన తర్వాత ఫ్యూడల్ తరహాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయ్యి సంత్సరకాలం పూర్తి అయిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు.. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు. హెలికాప్టర్ మనీ అని కెసిఆర్ చెప్తే చెయ్యలేదు. మోడీ ఇన్ని సార్లు విడియో కాన్ఫరెన్స్ పెట్టీ మాట్లాడుతున్నారు.

కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ను నిలదీస్తాం. బిజెపి ఎంపీ అరవింద్ ముందు రాష్ట్రం అభివృద్ది గురించి మాట్లాడు. రాష్ట్రానికి కేంద్రం నుండి తెచ్చే నిధులు గురించి కొట్లాడు. ఒక సంవత్సరం నుండి ఇచ్చిన హామీలు ఎటు పోయాయి. ఒక్కటన్న నెరవేర్చారా ? కేంద్రం నుండి తీసుకు వచ్చే నిధులు తీసుకురండి. అవి పక్కన పెట్టీ అభివృద్ది చేస్తున్న రాష్ట్రం మీద విమర్శలు చేయడం తగునా? అభివృద్ది అందుబాటు అనే నినాదం తో ప్రజల ముందుకు వచ్చాను. అదే కొనసాగిస్తున్నానని తెలిపారు.

Next Story
Share it