Telugu Gateway
Telangana

తెలంగాణలో మరో 33 పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరో 33 పాజిటివ్ కేసులు
X

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా..ఇక్కడ కరోనా కంట్రోల్ అవుతున్న దాఖలాలు కన్పించటం లేదు. కొద్ది రోజుల క్రితం తగ్గినట్లే కన్పించినా మళ్ళీ వరస పెట్టి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా తెలంగాణలో 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

ఇందులో 26 కేసులు జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. మిగిలిన ఏడు కేసులు కూడా వలస కార్మికులవి. కొత్తగా వచ్చిన 33 కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1196కు పెరిగింది. ఆదివారం నాడు ఒక్క డిశ్చార్జి కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 415గా ఉంది.

Next Story
Share it