Telugu Gateway
Telangana

వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు

వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు
X

కరోనా సృష్టించిన కల్లోలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు సొంత ఊర్లకు వెళ్ళేదారి లేక రోడ్డెక్కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది అయితే బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. వరంగల్ లో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నగర శివార్లలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో శుక్రవారం మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం నాడు నలుగురు మృతదేహలు వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో.. గురువారం మృతదేహాలుగా తేలారు.

కుటుంబ పెద్ద అయిన తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారా.. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అందుకు కారణాలేమై ఉంటాయి.. అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. గురువారం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పారిశ్రామిక ప్రాంతం వద్ద వెలుగు చూసిన ఈ ఘటన రాత్రి వరకు మిస్టరీగానే ఉంది. శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it