ఆకట్టుకుంటున్న ‘సాయిపల్లవి’ లుక్
BY Telugu Gateway9 May 2020 8:57 AM GMT
X
Telugu Gateway9 May 2020 8:57 AM GMT
సాయిపల్లవి. విలక్షణ నటి. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విభిన్న కథలతో కూడా చిత్రాలు చేయటంలో చాలా ముందు ఉంటుంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. శనివారం ఆమె పుట్టిన రోజు కావటంతో చిత్ర యూనిట్ సాయిపల్లవి లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా కన్పించబోతున్నారు. ఈ లుక్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో 'విరాటపర్వం' పేరుతో డైరెక్టర్ వేణు ఉడుగుల ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Next Story