Telugu Gateway
Cinema

రానా... ప్రేమికురాలు ఎవరో చెప్పేశారు

రానా... ప్రేమికురాలు ఎవరో చెప్పేశారు
X

రానాపై ఇక పుకార్లకు ఛాన్స్ లేనట్లే. ఎందుకంటే ఆయన తన ప్రేమికురాలు ఎవరో చెప్పేశారు. తాజాగా ఇద్దరూ కలసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాదు..ఫోటోపై ‘ఆమె ఎస్ చెప్పింది’ అని కామెంట్ పెట్టారు. దీంతో రానా కాబోయే భార్య ఎవరో తేలిపోయింది. మిహిక బజాజ్‌ అనే యువతితో తను ప్రేమలో ఉన్నానని రానా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా అలా ఫోటో పెట్టారో లేదో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

రానా ప్రేమికురాలు మిహిక విషయానికి వస్తే ఆమె హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆమె ఓ ఈవెంట్‌ మెనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. లండన్‌ చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ విభాగంలో ఎమ్‌.ఏ పూర్తి చేశారు. మిహిక తల్లి జ్యూవెల్లరీ డిజైనింగ్‌ రంగంలో ఉన్నారు. స్వీటి అనుష్కతోపాటు సమంత, ఉపాసన, తమన్నా, నిఖిల్‌, అల్లు శిరీష్‌, నిహారిక, సుషాంత్‌, రాశి ఖన్నా, శృతిహాసన్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రానాకు శుభాకంక్షలు తెలిపారు.

Next Story
Share it