ఈ ఏడాదే రానా పెళ్ళి
BY Telugu Gateway13 May 2020 7:24 PM IST

X
Telugu Gateway13 May 2020 7:24 PM IST
దగ్గుబాటి రానా పెళ్లి ఈ ఏడాదే ఉంటుందని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు తెలిపారు. మంగళవారం నాడు రానా తన ప్రేమ విషయాన్ని వెల్లడించటం..వెంటనే ఆయన పరిశ్రమలోని ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తటం తెలిసిందే. రానా దగ్గుబాటి సురేష్ తనయుడు అన్న విషయం తెలిసిందే. సురేష్ బాబు తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. 'మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి విపత్కర సమయంలో కూడా వేడుక చేసుకోవడానికి మాకు ఓ కారణం దొరికింది. చాలా కాలం నుంచి రానా, మిహికకు పరిచయం ఉంది. ఈ ఏడాది డిసెంబర్లో రానాకు వివాహం చేయాలని అనుకున్నాం. అయితే అంతకంటే ముందే వివాహం జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై ప్రస్తుతం మేం చర్చించుకుంటున్నామ'ని సురేష్ బాబు వెల్లడించారు.
Next Story



