Telugu Gateway
Politics

రాజకీయ నేతల నోట ‘కరోనా భాష’

రాజకీయ నేతల నోట ‘కరోనా భాష’
X

ఆ వైరస్ ఎవరికీ కన్పించదు. కానీ ఆ కన్పించని వైరస్ కు ఇప్పుడు కొత్త భాష పుట్టుకొచ్చింది. అది కూడా రాజకీయ నేతల రూపంలో. పార్టీ నేతలు విమర్శలకు ఇప్పుడు అందరూ కరోనా భాషనే వాడుతున్నారు. ఆ పదాలు కొత్తగా సృష్టించినవి కాకపోయినా కరోనా వచ్చాకే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పకతప్పదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీనే కరోనా వైరస్ లాంటిదని విమర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా కరోనా భాష బాగా పాపులర్ చేస్తున్నారు. అధికార వైసీపీ పదే పదే ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ సర్కారుపై టీడీపీ ఎలాంటి విమర్శలు చేసినా ఇప్పటికే ఇప్పటికే ‘టీడీపీ’ని ప్రజలు హోమ్ క్వారంటైన్ చేశారని..ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు శాశ్వతంగా హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనంటూ విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారు.

ప్రతిపక్ష టీడీపీ కూడా కరోనా వైరస్ కంటే వైసీపీ సర్కారు ప్రమాదకరంగా మారిందంటూ విమర్శలు చేస్తోంది. రాజకీయ విమర్శలకు ఇప్పుడు అన్ని పార్టీల నేతలు కరోనా భాషే వాడుతున్నారు. ట్రెండ్ ఫాలో అవటంలో పొలిటీషన్లు ముందు ఉంటారు. ఎప్పటి ట్రెండ్ కు అనుగుణంగా అప్పుడు తిట్లు మార్చేస్తుంటారు. అలా అయితేనే ప్రజలకు బాగా కనెక్ట్ అవుతామని భావించటమే దీనికి కారణం. పెద్ద నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇదే బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలు ‘ఐసోలేషన్’లో ఉన్నాయని..రైతుల పట్ల వారిది మొసలి కన్నీరు అంటూ తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇలా నేతలు అందరూ తమ తిట్లకు ‘కరోనా భాష’ వాడుకుంటున్నారు.

Next Story
Share it