మోడీ అత్యవసర సమావేశం
BY Telugu Gateway7 May 2020 11:21 AM IST

X
Telugu Gateway7 May 2020 11:21 AM IST
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డిఎంఎ) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని..ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రధానికి సీఎం జగన్ వివరించారు.
గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కూడా ప్రధాని మోడీ మాట్లాడి సహాయ చర్యలకు కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సిందిగా కోరారు.
Next Story