Telugu Gateway
Politics

టీటీడీ..ఏపీ సర్కారుకు పవన్ థ్యాంక్స్

టీటీడీ..ఏపీ సర్కారుకు పవన్ థ్యాంక్స్
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.)లో పని చేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగుల తొలగింపుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సంక్షోభ సమయంలో ఇలా చేయటం ఏ మాత్రం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. మిగిలిన పార్టీలు కూడా ఈ అంశంపై స్పందించాయి. దీంతో టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తప్పించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, వారి సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

దీనిపై పవన్ కళ్యాణ్ టి.టి.డి. కార్యనిర్వహణాధికారి అనిల్ సింఘాల్, టి.టి.డి. ట్రస్ట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తిరుమలేశుడిని నమ్ముకుని గత 15 సంవత్సరాలుగా అతి స్వల్ప జీతాలతో పారిశుధ్య సేవ చేస్తున్న వీరిని తొలగిస్తూ నిర్ణయించడం బాధనిపించి స్పందించినట్లు తెలిపారు. తమను విధుల్లో కొనసాగించడానికి అధికారులు అంగీకరించారని కార్మికులు ఒక లేఖ ద్వారా తెలియచేయడంతో సంతోషం అనిపించిందని అన్నారు.

Next Story
Share it