Telugu Gateway
Andhra Pradesh

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?
X

ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ కారణంగానే లోకేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు.ఉన్నమట్ల లోకేశ్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘు వేధించడం వల్లే ప్రాణం తీసుకోవాలనుకొన్నాడని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా? తాము ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదు అని పోలీసు అధికారులు గుర్తించాలి.

జన సేన కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి రఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఉన్నమట్ల లోకేశ్ కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు పవన్ కోరారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు... ఈ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందాతోపాటు ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నాయకులను పవన్ ఆదేశించారు.

Next Story
Share it