Telugu Gateway
Cinema

మీ అభిమానం వెలకట్టలేనిది

మీ అభిమానం వెలకట్టలేనిది
X

ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20. సహజంగా ప్రతి పుట్టిన రోజుకు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక ప్రత్యేక అప్ డేట్ అభిమానుల ముందుకు వచ్చేది. కానీ ఈ సారి కరోనా దెబ్బపడింది. ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉన్నా..అది సాధ్యపడలేదు. ఈ విషయాన్ని ముందే తెలియజేసింది చిత్ర యూనిట్..ఎన్టీఆర్ కూడా. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు ఎన్టీఆర్ కు పెద్ద ఎత్తున అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. వీటిపై ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. నా ప్రియమైన అభిమానుల్లారా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఎన్టీఆర్‌ తన ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మరో ట్వీట్‌ చేశారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.

Next Story
Share it