Telugu Gateway
Andhra Pradesh

టీటీడీ ఆస్తులు..కానుకల అమ్మకం బంద్

టీటీడీ ఆస్తులు..కానుకల అమ్మకం బంద్
X

తాజాగా తలెత్తిన వివాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్ లో టీటీడీ ఆస్తులు, కానుకలు, విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బోర్డు సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిటీని నియమిస్తున్నామని ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని..ఇందులో పీఠాధిపతులు, భక్తులుగా సభ్యులుగా ఉంటారన్నారు. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను మా పాలకమండలి పై రుద్దుతూ బురదజల్లిన వారిపై సమగ్రవిచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునెందుకు ప్రభుత్వాన్నీ కోరాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమల లో అతిధి గృహం కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుందని, పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని టిటిడి ఈఓ ని కోరుతున్నాం... టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో చిన్న పిల్లలు ఆసుపత్రిని నిర్మిస్తాం.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనాల విషయం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇఫ్పటికే లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వం అనుమతి ఇస్తే దర్శనాలకు వీలుగా భౌతిక దూరం పాటించటంతో భక్తులెవరికీ ఇబ్బంది లేకుండా ఉండేలా ఇఫ్పటికే పలు చర్యలు చేపట్టారు కూడా. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించే అవకాశం ఉంది. అది కూడా టైమ్ స్లాట్ ల ప్రకారమే క్యూలైన్లలోకి భక్తులను అనుమతించే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it