అనుష్క సినిమా సెన్సార్ పూర్తి
అనుష్క శెట్టి కీలక పాత్రలో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండేలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంగళవారం నాడే సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే ఈ సినిమా విడుదల థియేటర్లలోనా?. లేక ఓటీటీ ఫ్లాట్ ఫాంపైనా అన్న అంశంపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం తమ తొలి ప్రాధాన్యత థియేటర్లకే అని స్పష్టం చేశారు. కాకపోతే థియేటర్ల ప్రారంభం మరీ ఆలశ్యం అయితే మాత్రం చిత్ర యూనిట్ ఓటీటీల వైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి కనపడుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు.
సినిమా సెన్సార్ పూర్తయిన విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్‌లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు.