Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్

నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్
X

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఇదో కొత్త ట్విస్ట్. హైకోర్టు ఆదేశాల మేరకు తాను బాధ్యతలు స్వీకరించానని..ఎస్ఈసీ ఆఫీసు నుంచి కూడా అధికారికంగా సమాచారం పంపారని..ఇది ఏ మాత్రం చెల్లుబాటు కాదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటించారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ ఆదేశాలను ప్రభుత్వంలోని ఎవరూ పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రమేష్ కుమార్ ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ కు ఫోన్ చేసి తక్షణమే రాజీనామా చేయాలని..ఎస్ ఈసీలోకి కొత్త రక్తం తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారన్నారు. అంతే కాకుండా ఎస్ఈసీకి కేటాయించిన వాహనాలను హైదరాబాద్ లోని తన నివాసానికి పంపాల్సిందిగా రమేష్ కుమార్ ఆదేశించారన్నారు. అయితే తాము హైకోర్టు తీర్పుపై స్టే పిటీషన్ వేశామని..దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అనుసరించి తాను బాధ్యతలు చేపట్టానని రమేష్ కుమార్ ప్రకటించటం చట్ట విరుద్ధమని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. ఎస్‌ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది.

అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నియామకం కూడా చెల్లదు. హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. 2 నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. కానీ ఇది రాజ్యాంగ అంశాలు... హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది. ఏజీ శ్రీరామ్ శనివారం సాయంత్రం విజయవాడలో సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేదితో కలసి మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్వీయ ప్రకటితం చేసుకోవడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి చెప్పానన్నారు.

Next Story
Share it