Telugu Gateway
Politics

అదీ ఎన్టీఆర్ ‘స్టామినా’..లోకేష్ కు ఇరకాటం!

అదీ ఎన్టీఆర్ ‘స్టామినా’..లోకేష్ కు ఇరకాటం!
X

ఎన్టీఆర్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. తర్వాత క్రమక్రమంగా పార్టీకి దూరం చేయబడి..సినిమాల్లోనే బిజీ అయ్యారు. అసలు ఈ పాత చరిత్ర ఎందుకు అంటారా?. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు ట్వీట్ చేశారు. ఇందులోనూ పెద్ద ఆశ్చర్యపోవాల్సింది..వింత ఏమీలేదు. కానీ ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం నమోదు అయింది. ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ నారా లోకేష్ చేసిన ట్వీట్ ను ఏకంగా 8391 మంది రీట్వీట్ చేయగా..15800 లైక్స్ వచ్చాయి. లోకేష్ చేసిన ట్వీట్స్ లో బహుశా అత్యధిక రీట్వీట్, లైక్ లు వచ్చిన ట్వీట్ ఇదేనని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో కీలక విషయం ఉంది.

ఇదే నారా లోకేష్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పుట్టిన రోజున అంటే ఏప్రిల్ 20న కూడా ఇలాగే ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్ కు వచ్చిన లైక్ లు కేవలం 6345 అయితే..ఈ ట్వీట్ ను కేవలం 1532 మంది మాత్రమే రీట్వీట్ చేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పధ్నాలుగు సంవత్సరాల సీఎం, పదేళ్లకు పైగా ప్రతిపక్ష నేత వంటి రికార్డులు ఉన్న చంద్రబాబు కంటే ఎన్టీఆర్ కు అంత ఫాలోయింగ్ ఉండటం టీడీపీ శ్రేణులను ఒకింత ఇరకాటంలోకి నెట్టే అంశమే. ఈ మాట అంటే తెలుగుదేశం అభిమానులకు సహజంగా ఒకింత కాలుద్ది. స్వయంగా లోకేష్ చేసిన ట్వీట్ లోనే చంద్రబాబుకు, ఎన్టీఆర్ కు అంత తేడా చూపించారు అభిమానులు. ఎన్టీఆర్ తెలుగుదేశం రాజకీయాల్లో క్రియాశీలం కావాలనే డిమాండ్ పార్టీ అప్పుడప్పుడూ విన్పిస్తూ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ ట్వీట్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it