Telugu Gateway
Politics

ఆ ట్వీట్ కు జనసేనకూ సంబంధం లేదు

ఆ ట్వీట్ కు జనసేనకూ సంబంధం లేదు
X

మహత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపటంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. తాను చేసిన ట్వీట్ కు పార్టీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని..అది పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపారు. నాగబాబు పోస్ట్‌ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

‘అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథూరాం గురించి ఇచ్చిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదు. నాథూరాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని పేర్కొన్నారు. నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపటంతో ఆయన ఈ వివరణ ఇచ్చినట్లు కన్పిస్తోంది.

Next Story
Share it