మహేష్ బాబు న్యూలుక్
BY Telugu Gateway17 May 2020 12:25 PM IST

X
Telugu Gateway17 May 2020 12:25 PM IST
టాలీవుడ్ హీరోలు అందరూ ఇది ఫ్యామిలీ టైమ్ అంటున్నారు. ఎందుకంటే కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా లాక్ డౌన్. పోనీ కరోనా లేని దేశానికి వెళదామన్నా విమానాలు లేవు. సో..ఇంటి నుంచి బయటకు కదలలేని పరిస్థితి. అయితే ఎవరికి వారు ఈ కాలాన్ని తమదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం పూర్తి స్థాయిలో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు.
అంతే కాదు.. ఆ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఇఫ్పుడు వచ్చిన కొత్త లుక్ ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తోంది. అయితే అది సరదాగా చేసిన ప్రయత్నమా? లేక కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేశారా అన్నది కొద్దికాలం పోతే కానీ తెలియదు. ఈ ఫోటోను నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story