Telugu Gateway
Politics

ఉత్తరాంధ్రలో నేతలే బాగుపడ్డారు

ఉత్తరాంధ్రలో నేతలే బాగుపడ్డారు
X

వనరులు ఎన్ని ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రాంత నేతలు మాత్రం వందల కోట్ల రూపాయల ఆస్తులు..భూములు సంపాదించుకున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలు మాత్రం కష్టాలు పడుతూనే ఉన్నారని అన్నారు. జనసేన నేతలకు వ్యాపార సంబంధాలు లేవు కాబ్టే ప్రజా సమస్యలపై గళమెత్తగలుగుతున్నారని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ఆదివారం నాడు విజయనగరం జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇజ్రాయెల్ లో జల వనరుల కొరత ఉన్నా ఎన్నో దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని..ఉత్తరాంధ్రలో అందుకు భిన్నంగా జల సంపదతో పాటు ఎన్నో వనరులు ఉన్నా ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోలిస్తే విజయనగరంలో కరోనా కేసులు తక్కువే ఉన్నా..రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రభుత్వపరంగా స్పందన సరిగా ఉందా లేదా అన్న దానిపై ఎప్పుడూ గమనిస్తూ ఉండాలన్నారు.

Next Story
Share it