ఏపీలో కియా అదనపు పెట్టుబడులు
BY Telugu Gateway28 May 2020 2:37 PM IST

X
Telugu Gateway28 May 2020 2:37 PM IST
కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. గురువారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో క్యూన్ షిమ్ ఈ ప్రకటన చేశారు రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన ఎన్నో అనుకూలతలు ఏపీలో ఉన్నాయని విదేశీ పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలమైన వనరులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు మంచి సహకారం అందుతోందని తెలిపారు.
Next Story