Telugu Gateway
Politics

కాళేశ్వరం టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు

కాళేశ్వరం టెండర్లపై కేంద్ర  విజిలెన్స్ కమిషన్ కు  ఫిర్యాదు
X

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో ఉందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు వేసిన సర్కారు ఆగమేఘాల మీద కాళేశ్వరం మూడవ టీఎంసీ అంటూ 21 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పుడు టెండర్లు పిలవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం 21వేల టెండర్లు పిలవడాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల అసోషియేషన్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గత పనుల వల్ల అదనంగా 8వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ కు ఇప్పటికే 3లక్షల 21వేల అప్పులు ఉన్నాయని, మళ్ళీ మరో 21వేల కోట్ల భారం ఏ మాత్రం సరికాదన్నారు.

ఈ ప్రాజెక్టు డిపీఆర్ పై విచారణ చేయాలన్నారు. ఎలాంటి అప్పులు లేకుండా నాగార్జున సాగర్-శ్రీపాద ఎల్లంపల్లితో పాటు ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కట్టారన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పై విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయటానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రతిపక్షాలు, మీడియాను తిడితే అసలు విషయాలు బయటకు రావు అని సీఎం ఆలోచనగా ఉందన్నారు. మద్యం షాపులు తెరవడం వల్ల వైద్యులు, పోలీసుల ఇన్ని రోజుల శ్రమ అంతా వృధా అయింది కదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి లోన్స్ ఇస్తున్న సంస్థలు ప్రాజెక్టుల డీపీఆర్ లను పరిశీలించాలన్నారు.

Next Story
Share it