Telugu Gateway
Telangana

తెలంగాణలో ఆరు కేసులే

తెలంగాణలో ఆరు కేసులే
X

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండబట్టే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అంతే కానీ పరీక్షలు చేయకపోవటం వల్ల కేసులు తగ్గుతున్నాయనే వాదన ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. పరీక్షలు ఎవరికి చేయాలనే అంశంపై ఐసీఎంఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ లు చేయవద్దని ఆదేశించిందని తెలిపారు. శుక్రవారం నాడు కొత్తగా రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఈటెల వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి పెరిగింది.

అదే సమయంలో శుక్రవారం నాడు 24 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 464 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 552గా ఉంది. కరోనా పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయటం మానుకోవాలని అన్నారు. బిజెపి నేతలు తమకు ఏమైనా అనుమానాలు ఉంటే కేంద్రాన్ని సంప్రదించాలని, కేంద్ర బృందం ఓ వైపు తెలంగాణ పనితీరును ప్రశంసిస్తుంటే విపక్షాలు రాజకీయం చేయటం మానుకోవాలన్నారు.

Next Story
Share it