Telugu Gateway
Telangana

నేను ఆరోగ్యంగానే ఉన్నా..కెటీఆర్

నేను ఆరోగ్యంగానే ఉన్నా..కెటీఆర్
X

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా తుమ్ములతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి. దీంతో నెటిజన్లు చాలా మంది మంత్రి ఆరోగ్యంపై ఆరా తీయటం ప్రారంభించారు. ఈ వార్తలపై మంత్రి కెటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తన ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా తాను కోల్డ్‌ అలర్జీతో బాధపడుతున్నానని, అదేమీ తనకు సమస్య కాలేదని చెప్పారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరంలేదని కేటీఆర్‌ తన అభిమానులకు తెలిపారు. ఇక సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే క్షమించాలని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

Next Story
Share it