కొమ్మినేని శ్రీనివాసరావుకూ హైకోర్టు నోటీసులు
BY Telugu Gateway29 May 2020 2:17 PM IST

X
Telugu Gateway29 May 2020 2:17 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల అంశంపై హైకోర్టు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో 49కి నోటీసులు జారీ చేసిన హైకోర్టు శుక్రవారం నాడు కొత్తగా మరో 44 మందికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు, వీడియోల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో వీరికి నోటీసులు జారీ చేశారు. ఇందులో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్ ప్రభాకర్ సహా 44 మందికి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు తదుపరి చర్యలు ప్రారంభించారు.
Next Story