Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు
X

రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, ముగ్గురు వలస వచ్చిన వారు అని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. గురువారం నాడు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారు మొత్తం 693 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారు 400 మంది ఉన్నారని తెలిపారు.

తాజాగా వెలుగు చూసిన 15 కేసులు కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటివరకూ వచ్చిన పాజిటివ్ కేసుల మొత్తం 1122గా నిలిచింది. మూడు జిల్లాల్లో అసలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇందులో వరంగల్ (రూరల్),యాదాద్రి, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. మరో 22 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Next Story
Share it