థియేటర్లకు ప్రేక్షకులు..బీర్లు పెట్టాలంట

‘మహానటి’ సినిమాతో దర్శకుడిగా ఓ రేంజ్ కు వెళ్ళిన వ్యక్తి నాగ్ అశ్విన్. కాకపోతే ఆయన నుంచి ఈ ప్రతిపాదన రావటం విచిత్రమే. అంతే కాదు..ఒకింత షాకింగ్ కూడా. కరోనా దెబ్బకు అన్ని రంగాల తరహాలో టాలీవుడ్ కూడా కుదైలైంది. ఈ తరుణంలో నాగ్ అశ్విన్ ఓ విచిత్ర ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అంతే కాదు..దీనిపై అభిప్రాయాలు చెప్పండి ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ట్వీట్ సారాంశం ‘ఒకసారి నేను, సురేష్ బాబు, రానా థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి అని చర్చించుకున్నాం. విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా థియేటర్లలో బీర్, వైన్, బ్రీజర్ అందించేందుకు లైసెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది.. వ్యాపారం మెరుగుపడుతుందా అని చర్చించుకున్నాం.
ఇంతకు నా ఆలోచన మంచిదా, చెడ్డదా చెప్పండి’ అంటూ నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఓ వైపు ప్రతి సినిమాకు ముందు మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అని వేసే సినిమాల్లో మందు సరఫరా చేయాలని నాగ్ అశ్విన్ ప్రతిపాదించటం విచిత్రం. అయితే నాగ్ అశ్విన్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా చేస్తే థియేటర్లకు ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం అవుతారని తెలిపారు. సినిమా హాళ్ళు ఇప్పట్లో తెరిచే సూచనలు కన్పించకపోవటంతో చాలా మంది ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో ఓటీటీ మార్గం తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.