రామ్ ‘డించక్’ సందడి
లాక్ డౌన్ వేళ హీరో రామ్ ‘డించక్’ అంటూ పాట గ్లింప్స్ ను విడుదల చేశారు. శుక్రవారం ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా డించక్ పాట ఎలా ఉండబోతుందో చూపెట్టింది. ఇందులో హీరో రామ్, హెబ్బా పటేల్ స్టెప్పులు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం రామ్ రెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. కిశోర్ తిరుమల దర్శకత్వం లో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు.
కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని రామ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. రామ్ కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=n0yFRpe9wt0