Telugu Gateway
Politics

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు
X

పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ సీఎం జగన్ ‘కుమ్మక్కు రాకీయాలు’ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశం అయిన ఇద్దరు సీఎంలు ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు అంశంపై ఏపీ సర్కారు ఎంతో వేగంగా వెళుతుంటే తెలంగాణ సీఎం మౌనంగా చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు అంశంపై కాంగ్రెస్ నేతల బృందం గురువారం నాడు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు రేవంత్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తో బేటీ అయిన వీరు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే తెలంగాణలోని నాలుగు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి నెలలోనే పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ నిర్ణయం గురించి కేసీఆర్ కి టి-కాంగ్రెస్ తెలిపింది.

జనవరిలో కేసీఆర్ దృష్టికి వచ్చినా ఎందుకు కేసీఆర్-జగన్ తో మాట్లాడలేదు? ఏపీ విడుదల చేసిన జివో 203 కలిపి మేము కృష్ణ రివర్ బోర్డ్ చెప్పాము. ఏపీ 3టీఎంసీ కి వెసులుబాటు కల్పించడం పై కూడా బోర్డ్ దృష్టికి తీసుకొచ్చాము. విభజన అంశాలతో పూర్తిగా అన్ని అంశాలతో లిఖిత పూర్వకంగా బోర్డ్ కు తెలిపాము. సాగునీరే కాకుండా తాగునీరు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖకు బోర్డ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. బోర్డ్ సమర్థవంతంగా ఉండకపోతే ఏ రాష్ట్రం ఎంత నీరు డ్రా చేస్తోందో అంకెలు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. బోర్డ్ ఆధీనంలో పరిధిలో కేంద్ర బందోబస్తును ఏర్పాటు చేయాలి. కేంద్ర జలాశక్తి మంత్రికి కూడా లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Next Story
Share it